గెట్ టుగెదర్.. పరవశించిన స్నేహబంధం.....





  పినపాక, జూన్ 08, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పదవ తరగతి పూర్తి చేసుకుని 17సంవత్సరాలు గడిచిన తర్వాత స్నేహితులు అందరు ఒక దగ్గర కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పినపాక 2007-2008 పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 

 దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పినపాక పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సందడి చేశారు.17 సంవత్సరముల తర్వాత మొదటి సారి కలిసిన స్నేహితులు పాఠశా ఆవరణలో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమకు విద్యను బోధించి విజ్ఞానులను చేసిన ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులైన రమణ మేడం, జగ్యా , లక్ష్మణరావు, నాగమహేశ్, శ్రీను లకు పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.ఉపాధ్యాయులతో కలిసి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

Post a Comment

أحدث أقدم