ఘనంగా బక్రీద్ పండగ వేడుకలు

 


అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని మంచి కంటి నగర్ ఈద్గా ప్రాంగణంలో మండలంలోని ముస్లిం సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత గురువు మాట్లాడుతూ ప్రవక్తలు బోధించిన సద్ మార్గంలో నడవాలని వారు సూచించిన జాలీ దయ దానధర్మాలు విరివిరిగా చేయాలని ఎదుటివారితో సోదర భావంతో మెలగాలని తెలియజేశారు. అనంతరం ఒకరినొకరు ఆ లింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జామ మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ సందర్భంగా బందోబస్తు నిర్వహించిన పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ సభ్యులు మత పెద్దలు మత గురువులు మండలంలోని ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది