పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎండ ఉబ్బరానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు కాస్త ఉపశమనం కలిగింది కానీ... ఓ వైపు వరి ధాన్యం, మిర్చి ఆరబెట్టిన రైతన్నలు ఆవేదన చెందుతున్నారనే చెప్పాలి. పరాగాలు తీసుకొని పంట కల్లాల వద్దకి పరుగులు తీస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిచి రైతన్న కంట నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఈ అకాల వర్షాల దాటికి రైతన్నలకు నష్టాన్ని మిగులుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే మే నెలలో ఇలాంటి వర్షాలు రావడం చాలా ఆరుదు అని నిపుణులు చెబుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి