అశ్వారావుపేట, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి సతీష్ గౌడ్:
అశ్వారావుపేట మండలంలో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా నిన్నటి వరకు తీవ్ర ఎండలతో ఉక్కపోతతో ఇబ్బందులు పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న మండల ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు.ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లనీ కాలువలను తలపిస్తున్నాయి. ఓ వైపు వరి ధాన్యం, మిర్చి ఆరబెట్టిన రైతన్నలు ఆవేదన చెందుతున్నారనే చెప్పాలి. పరాగాలు తీసుకొని పంట కల్లాల వద్దకి పరుగులు తీస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిచి రైతన్న కంట నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఈ అకాల వర్షాల దాటికి రైతన్నలకు నష్టాన్ని మిగులుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే మే నెలలో ఇలాంటి వర్షాలు రావడం చాలా ఆరుదు అని నిపుణులు చెబుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి