మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
... ప్రపంచ నో టొబాకో దినోత్సవ సందర్భంగా ఈరోజు నుంచి ప్రతి ఒక్కరం పొగాకు వాడకాన్ని నిషేధిద్దామని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంపాటి సూరి రెడ్డి అన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని డీవీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరల్డ్ నో టుబాకో దినోత్సవ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పొగాకు వాడకాన్ని వదిలేస్తేనే ప్రాణాలను కాపాడుకుంటామని పేర్కొన్నారు. సిగరెట్ బీడీ చుట్ట కైని అనే వివిధ రూపాల్లో పొగాకును వినియోగిస్తూ ఎందరో మృత్యువాతకు గురవుతున్నారు అన్నారు.
ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య రోజుకు పెరుగుతుండడం ఆందోళనకరమైన విషయం అన్నారు. ధూమపానం వలన అది తాగే వ్యక్తితో పాటు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాలను కూడా పాడు చేస్తుందన్నారు.
అలాగే ఖైని, గుట్కా తిని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం వలన బ్యాక్టీరియా చేరి పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేయడమే కాక పలు రోగాలను తెచ్చిపెడుతోందన్నారు.
వీటితోపాటు గంజాయి ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులతో పాటు పలురు బానిసలు అవుతున్నారని వీటిని గమనించిన ప్రతి ఒక్కరు వెంటనే 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
అనంతరం విద్యార్థులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్ల చే పొగాకు వినియోగాన్ని నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
*కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బద్దం శ్రీనివాస్ రెడ్డి కౌన్సిల్ అంకం సర్వేశ్వరరావు, న్యాయవాదులు కె విజయ్, పోషం భాస్కరరావు, ప్రభు, కోర్టు కానిస్టేబుల్ బుచ్చిబాబు, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.*
إرسال تعليق