నెలల తరబడి నిలిచిపోతున్న ఉత్తరాలు, పోస్టల్, బ్యాంకింగ్ సేవలు


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 

పోస్టల్ శాఖపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిర్లక్ష్యం -సిపిఎం పార్టీ    మండల     కన్వీనర్     కొమరం    కాంతారావు

 

మండలంలో ఎన్ని బ్రాంచ్ లో పోస్ట్ ఆఫీస్, బ్యాంకింగ్ సేవలు సక్రమంగా అందుతున్నాయో తేల్చాలని డిమాండ్ 

 

తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్న పోస్టల్ సిబ్బంది 


కరకగూడెం: మండలంలో    పోస్టల్    సిబ్బంది    తీవ్ర నిర్లక్ష్యం    కనబరుస్తున్నారని    ఎన్ని     బ్రాంచ్ల్లో    పోస్ట్ ఆఫీస్     బ్యాంకింగ్    సేవలు     సక్రమంగా అందుతున్నాయో     సమాధానం     చెప్పాలని    సిపిఎం పార్టీ    మండల     కన్వీనర్     కొమరం    కాంతారావు డిమాండ్    చేశారు.    మండలంలో    పోస్టల్     బ్రాంచ్    లపై అధికారులు    తనిఖీలు    చేయాలని    నిత్యం    పర్యవేక్షణ లేకపోవడంతో     నెలల    తరబడి    ఉత్తరాలు నిలిచిపోతున్నాయని    వారన్నారు.    దీనిపై     అధికారులకు     ఫిర్యాదు    చేయనున్నట్లు    ఈ సందర్భంగా    వారు     తెలిపారు.     సక్రమంగా    ఉత్తరాలు అందని    ఫలితంగా     అనేక     సార్లు     ఇబ్బందులకు గురవుతున్నారని     ఎంతో     కోల్పోతున్నారని     వారన్నారు ప్రజలకు    సక్రమంగా    అందుబాటులో    లేని    పోస్ట్ సేవలు ఎందుకని     వారు    ఎద్దేవా    చేశారు.    ఈ    విధమైన పరిస్థితి    కొనసాగితే    ఉద్యోగాలకు   సంబంధించిన ఉత్తరాలు    వస్తే    ఏమిటని దీనివలన నష్టపోయేది ఎవరని వారు ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో ఎన్ని పంచాయితీల్లో  సక్రమంగా    పోస్టల్   బ్యాంకింగ్     సేవలు అందిస్తున్నారు   సమాధానం    చెప్పాలని,    వారు    ఆడింది ఆటగా    పాడింది    పాటగా    కొనసాగుతుందని    తక్షణమే అధికారులు    స్పందించి    విచారణ     జరిపి    మండలంలో కొనసాగుతున్న     పోస్టల్    సేవలను    ప్రజలకు అందుబాటులోకి    తీసుకురావాలని    వారన్నారు అధికారులు     స్పందించకపోతే     ఆయా    గ్రామాల ప్రజలను     కూడా    పెట్టి     ఆందోళన    నిర్వహిస్తామని    ఈ సందర్భంగా    వారు    హెచ్చరించారు.


ఇది కూడా చదవండి....

మావోయిస్టు పార్టీ సంచలన లేఖ



Post a Comment

కొత్తది పాతది