పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మల్యే రేగ కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పూస సంతోష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీకి లాభం జరిగే విదంగా ప్రయత్నం చేస్తానని అధికార పక్షం ఒంటెద్దు పోకడలు, అబద్దాలతో ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడుతూ ఎప్పటికప్పుడు కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తానని తెలియజేశారు. మండల సోషల్ మీడియా అధ్యక్షుకుడిగా ఎన్నుకున్నందుకు రేగ కాంతారావు కి,మండల అధ్యక్షుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు.
إرسال تعليق