కన్నాయిగూడెం , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజబాబు:
తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ గ సూచనల మేరకు జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ కార్యక్రమం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు, సింగారం, చింతగూడెం గ్రామపంచాయతీలలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
సమావేశంలో పాల్గోన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి. అప్సర్ పాషా మరియు మండల ఇన్చార్జి జాడి రాంబాబు గారు మాట్లాడుతూ
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ (Ambedkar) పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు (Jai bapu), జై భీమ్ (Jai bhim), జై సంవిధాన్ (jai samvidhan) ప్రచారం ప్రారంభించింది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి అంబేద్కర్‌ను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేస్తామన్నారు.
ఈ ప్రచారం జవనరి 26న అంబేడ్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో భారీ ర్యాలీతో ముగుస్తుందని తెలిపారు.
అంబేడ్కర్‌పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు గాను హోం మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నామన్నారు
*బిజేపి,బిఆర్ఎస్* పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
ప్రతి గ్రామంలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు
ప్రతి గ్రామ పంచాయతీలలో సమావేశాలు నిర్వహించి,కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని మాట్లాడారు
బిజేపి పార్టీ *భారత రాజ్యంగం* ను అవహేళన చేస్తూ,అవలంబిస్తున్న నియంత్రృత్వ పొకడలను ఖండిస్తూ *అఖిల భారత కాంగ్రెస్ కమిటి* పిలుపు మేరకు ఈరోజు *ములుగు జల్లా కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు ఎం డి.అప్సర్ పాషా గారి అధ్యక్షతన* నిర్వహించిన *జై బాపు,జై భీమ్,జై సంవిధాన్* కార్యక్రమం సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు యూత్ మండల నాయకులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి