వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

 



-ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి



-దేశ అభివృద్ధి తరగతి గదిలో ఉందన్నా ఎమ్మెల్యే పాయం



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 దేశ అభివృద్ధి తరగతి గదుల్లో ఉన్నదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యాశాఖ వారు నిర్వహిస్తున్న పినపాక, కరకగూడెం మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ అన్ని స్థాయిలలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, ఇంకా మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కోరారు. విద్యా అభివృద్ధికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మెరుగైన బాటలు వేయాలన్నారు. దేశ అభివృద్ధి జరగాలంటే విద్యతోనే సాధ్యమని తెలియజేశారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉత్తమంగా అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పినపాక ఎంపీడీఓ సునీల్ కుమార్, ఎంపీఓ, ఎంఈఓ, కరకగూడెం, పినపాక మండల ఉపాధ్యాయులు, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم