పాకిస్తాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు బలోచిస్థాన్

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;



భారత్ తో కాల్పులు విరమణ ఒప్పందం పై పాకిస్తాన్ ఊసరవెల్లి మాటలను నమ్మొద్దని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. పాక్ నుంచి వచ్చే శాంతి, సోదరభావం, కాల్పుల విరమణ వంటి ప్రకటనలు మోసం మాత్రమేనని పేర్కొంది. అవి ఉపాయాలేఅని, యుద్ధ వివాహంలో భాగమును తీవ్రంగా విమర్శించింది. పాకిస్తాన్ పై అప్రమత్తంగా ఉండాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పరోక్షంగా భారత్ కు సూచించింది.


పాకిస్తాన్ విషయంలో త్రివిధ దళాలకు ఫ్రీ పవర్ ఇచ్చారు ప్రధాని మోదీ.


ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయ్యాక తొలిసారి DGMOలతో సమావేశం అయ్యారు మోదీ. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పాక్ ఒక్క తూటా వేస్తే మీరు మిసైల్ తో బదులివ్వండని త్రివిధ దళాలలతో ప్రధాని మోదీ అన్నారు. 


ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని త్రివిధ దళాల సమావేశంలో మోదీ అన్నారు. పీఓకే విషయంలో భారత వైఖరి మారలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ను పాక్ అప్పగించాల్సిందేనని అన్నారు. ఉగ్రవాదులను భారత్ అప్పగించాల్సిందేనని, ఈ విషయంలో పాక్ కు గత్యంతరం లేదని స్పష్టం చేశారు.


తమ మధ్యవర్తిత్వం తోనే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. పాక్ విషయంలో ఏం చేయాలో తాము చూసుకుంటామని, తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని.


ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయ్యాక తొలిసారి త్రివిధ దళాలతో సమావేశమైన ప్రధాని పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్మీ DGMO రాజీవ్ ఘాయ్, ఎయిర్ ఫోర్స్ DGMO ఏకే భారతి, నేవీ DGMO ఏఎన్ ప్రమోద్ పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది