అశ్వాపురం మండల కేంద్రంలో ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి...

 



రహదారులు విస్తరణలో భాగంగా అశ్వాపురం ప్రధాన కూడలిలో బాబాసాహెబ్ విగ్రహం తప్పనిసరిగా పెట్టాలి....



మాల జన సమితి అధ్యక్షుడు చెట్టి సురేష్ డిమాండ్...


అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో రహదారులు విస్తరణలో భాగంగా అశ్వాపురం ప్రధాన కూడలిలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మాల జన సమితి పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు చెట్టి సురేష్ డిమాండ్ చేశారు. ఈ విగ్రహం కోసం గత ఐదు సంవత్సరాల నుంచి సంఘాలుగా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన ఎన్నో పోరాటాలు చేసిన ఫలితం లేదని ఈసారి తప్పకుండా బాబాసాహెబ్ విగ్రహం అశ్వాపురం మండల కేంద్రంలో ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని, దీనికోసం అశ్వాపురం లో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు, దళిత గిరిజన బహుజన సంఘాల నాయకులు ప్రజాసంఘాలవారు కలిసి రావాలని కోరారు. స్థానిక పినపాక శాసనసభ్యులు కూడా ఈ విషయంపై స్పందించి అశ్వాపురం మండల కేంద్రంలో ప్రధాన కూడలిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ సలహాలు సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. అశ్వాపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారి కూడలిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై అందరూ స్పందించాలని దీనిపై అందరి నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు...

Post a Comment

కొత్తది పాతది