ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో 10 నుండి 11 వరకు ఇసుక ర్యాంపులు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా ఏజన్సీ ఖనిజ సంపద ఇసుక తరలిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి అక్రమ తొలకాలను నిలిపివేయాలి.
మైదాన ప్రాంతానికి చెందిన అశోక్ రెడ్డికి ఏజన్సీ ప్రాంతంలో ఇసుక సొసైటీ లపై రిజింగ్ కాంట్రాక్టర్ గా పెత్తనం ఏంటి.? దీని వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ ఎవరు తుడుందెబ్బ సుటి ప్రశ్న.??
5 వ షెడ్యూల్ భూభాగంలో జరుగుతున్న అన్యాయంపై న్యాయస్థానాల్లో కేసులు వేస్తాం , ప్రజా ఉద్యమం తప్పదు.
తుడుందెబ్బ, ఆదివాసీ jac ఆధ్వర్యంలో 15, మే,2025 న మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో ముందు ధర్నా, అనంతరం వినతిపత్రం అందజేయడం జరుగుతుంది.
ఆల్లెం కోటి, తుడుందెబ్బ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్లెం కోటి మాట్లాడుతూ,.. టీ కొత్తగూడెం గోదావరి పరివాహక ప్రాంతం నుండి అశ్వపురం వరకు వివిధ ఇసుక ర్యాంపులు 10 నుండి 11 వరకు ప్రభుత్వం నుండి మంజూరు జరిగాయి, పట్టా భూముల పేరుతో కొన్ని సోసిటీల పేరుతో కొన్ని పట్టా భూముల పేరుతో 1953 అవతల లేనివి కూడా సృష్టించి అమాయక ప్రజలను అడ్డుపెట్టుకొని బినామీలను సృష్టించి అధికారులను మేనేజ్ చేస్తూ తప్పుడు డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని నమ్మించి వివిధ శాఖల నుండి పర్మిషన్ లు తీసుకొచ్చి నడి గోదావరిలో వ్యవసాయ భూములు కానీ చోట కూడా భూమి యంత్రాలు ఫ్లోక్లెన్ లు పెట్టీ ఓబులపురం గనుల్లగా తవ్వుతూ ఏజన్సీ ప్రాంతం నుండి ఆదివాసీ సంపద దోచుకుపోతున్నారు. వాల్ట చట్టం, 1 ఆఫ్ 70 చట్టం , ఎన్విరాల్మెంట్ చట్టాలను ఉల్లంఘిస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు. దాని మూలంగా భూగర్భ జలాలు ఇంకిపోతున్నయి అని పేర్కొన్నారు. అలాగే ఆదివాసీ సొసైటీ ల పేరుతో రెజింగ్ కాంట్రాక్టర్ ల పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మంత్రి పేరు చెప్పుతూ ఆడింది ఆటగా పాడింది పాటగా ఆదివాసీల సొమ్ము ఆదివాసీలకు దక్కకుండా ఆదివాసీలతో తియ్యాల్సిన ఇసుక భారీ యంత్రాలతో తీస్తూ నడి గోదావరిలోకి అటవీ గుట్టల్ని ధ్వంసం చేస్తూ ఆ యొక్క మట్టితో రోడ్డు వేస్తూ 1అఫ్ 70 చట్టం, పీసా చట్టం కి తూట్లు పొడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
పేరుకే ఆదివాసీ ఇసుక ర్యాంపులు పెత్తనం మొత్తం అధికార పార్టీ అండదండలతో మైదన ప్రాంత అగ్రవర్ణలదే ఈ యొక్క దందా పినపాక, మణుగూరు, అశ్వపురం మండలాల్లో జోరుగా సాగుతూ వారి యొక్క అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుందని పేర్కొన్నారు. ఈ యొక్క అక్రమ వ్యాపారంపై తక్షణమే ఐటీడీఏ పీవో, భద్రాచలం గారు , జిల్లా కలెక్టర్, టీ.ఎస్ ఎం.డి.సి , జిల్లా మైనింగ్ అధికారులు, స్థానిక అధికారులు వీటిపై విచారణ చేపట్టి ఏజన్సీ ప్రాంత వనరులు అనగా జల్, జంగిల్, జమీన్ లను కాపాడలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మైదాన ప్రాంత గిరిజనేతరులకు రిజింగ్ కాంట్రాక్టర్ లకు కేటాయించకుండా స్థానిక ఆదివాసీలకు ఉపాధి, ఉపయోగం కలిగేలా చట్టాలున్న వాటిని అమలు చెయ్యకపోవడం దారుణం అని అన్నారు. వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి వనరుల దోపిడీ అపకపోతే భారీ ఉద్యమం తప్పదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ నుండి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో.._దబ్బకట్ల సుమన్
ఆదివాసీ లిబరేషన్ ఫోర్స్, రాష్ట్ర అధ్యక్షులు __తాటి మధు
తుడుందెబ్బ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మరియు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి