జాతీయ డెంగ్యూ దినోత్సవం.... అవగాహన ర్యాలీ నిర్వహించిన- వైద్యురాలు




 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్:


- దోమల పట్ల జాగ్రత్తలు తీసుకోండి


పరిసర ప్రాంతాల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోండి- వైద్యురాలు దుర్గా భవాని 


పినపాక మండల కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యురాలు దుర్గా భవాని ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... డెంగ్యూ వండి వ్యాధులు రాకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంకో రెండు వారాల్లో వర్షాకాలం వస్తుందని, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వేస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم