రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఒకేసారి మూడు నెలల రేషన్...!


వర్షాకాలంలో తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.


జూన్‌ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చన్న అంచనాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందస్తుగానే లిఫ్టింగ్‌ చేసి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 


మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.


 *రాష్ట్రంలో జూన్‌లోనే 3 నెలల సరఫరా* 

ఏప్రిల్‌ కోటా రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే జూన్‌లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. 


ప్రతినెలా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమైన నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. 


రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్‌ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించి వచ్చే నెలలో మూడు నెలల రేషన్‌ కోటాను విడుదల చేసేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది.


ఇది కూడా చదవండి...

హిజ్రా ఉరి వేసుకుని హత్మహత్య


పదిమంది పేకాటరాయలు అరెస్ట్


గ్రేట్ దేవత లాంటి డాక్టరమ్మ

Post a Comment

أحدث أقدم