పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై రేపు ఉదయం 10 గంటలకు పినపాక రైతు వేదికలో
భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై రేపు పినపాక రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తాసిల్దార్ అద్దంకి నరేష్ తెలియజేశారు. గురువారం ఆయన పినపాక తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ.. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టంపై సదస్సులో జిల్లా కలెక్టర్ హాజరై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందన్నారు. రైతు వేదికలో జరిగే ఈ సమావేశానికి మండలంలోని రైతులు హాజరుకావాలని ఈ సందర్భంగా తాసిల్దార్ కోరారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి