గుండాల, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పర్యటన లో భాగంగా లింగగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల చీమలగూడెం గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు కల్తి సారయ్య- వెంకటమ్మ గారి ఇంట్లో భోజనం చేసిన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు. ఈ సందర్బంగా వారు లబ్ధిదారుడితో మాట్లాడుతూ సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవడాన్ని అభినందించారు. ప్రతీ పేదవాడికి సన్న బియ్యం పథకం చాలా ఆసరాగా మారుతుంది అని ఈ పథకం ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రావణాలు తగుతాయని తెలియజేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని పేదల ప్రభుత్వం అని ప్రతీ పేదవాడి కడుపు నింపడమే ప్రధాన లక్షంగా ఈ పథకం అమలు చేయడం జరిగింది అని తెలియజేసారు. భోజనం అనంతరం మంచి రుచి కరమయిన భోజనం పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల అన్ని శాఖల అధికారులు,psr-pvr యువసేన కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ SK ఖదీర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, AMC డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్, సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, పాయం గణేష్, యువజన నాయకులు సుతారి చంటి, జర్పుల సక్రు, బొర్ర వెంకటేశ్వర్లు, పూనెం లక్ష్మి, ఈసం భద్రయ్య, పల్లపు రాజేష్, పుష్పరాజ్, అలాగే ఆళ్ళపల్లి మండల నాయకులు వాసం శ్రీకాంత్, ఊళ్ళోజు భరత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق