ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాయం
మణుగూరు మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవనాన్ నందు మండల అధ్యక్షుడు అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన *పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో రెలితో మణుగూరు అంబేద్కర్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో తిరుగులేని మహా నాయకుడని.ఆయన తన జీవితం మొత్తం వివక్షకు గురైన వర్గాల ఆకాంక్షలకు,హక్కుల కోసం పోరాటానికి అంకితమయ్యారు.రాజ్యాంగ నిర్మాతగా ఆయన వహించిన పాత్ర దేశానికి దారి చూపింది.సామాజిక,ఆర్థిక,రాజకీయ సమానత్వం ఆయన కల అది నేడు కూడా శక్తివంతమైన మార్గదర్శకమని బీఆర్ అంబేద్కర్ వారు రూపొందించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు. వారి చూపిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందిఅని తెలియజేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌ!! శ్రీ!! పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు,టౌన్ అధ్యక్షులు శివ సైదులు గారు, మహిళా మండల అధ్యక్షురాలు సౌజన్య గారు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు,మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق