తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

ఐదో సెషన్, మూడో రోజు బిజినెస్

ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం. 

 శాసనసభ, శాసనమండలిలో ఈరోజు ప్రశ్నోత్తరాలతో సభలు ప్రారంభం కానున్నాయి. 

శాసనమండలిలో ఈరోజు కేవలం ప్రశ్నోత్తరాల వరకే బిజినెస్ పరిమితం

ప్రభుత్వ పథకాల అమలు, కళ్యాణమస్తు పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీ కోసం భూసేకరణ, రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, వరి ధాన్యానికి బోనస్, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, వరి ధాన్యం సేకరణ,

తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి సరఫరా.ఈ ప్రశ్నలు మండలిలో చర్చకు రానున్నాయి. 

శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నలు మెస్ డైట్ చార్జీల పెంపు, జాతీయ రహదారుల సమీపంలో ట్రామా కేర్ కేంద్రాలు, విదేశీ ఉపకార వేతనాల చెల్లింపులో జాప్యం, కామారెడ్డి జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి, దేవాలయ పర్యాటకం మరియు పర్యావరణ పర్యాటకాల ప్రోత్సాహం, శంకరపట్నం మండలంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ప్రభుత్వ వెబ్సైట్లో జీవోలు మరియు సర్కులర్లు, హెచ్ఎండిఏ భూముల తాకట్టు, మహబూబాబాద్ పట్టణం చుట్టూ రింగ్ కోసం నిధులు, టీ-ఫ్రైడ్ కింద రాయితీ. 

తెలంగాణ శాసనసభలో ఈరోజు 5 బిల్లులను ప్రవేశపెట్ట నున్నారు

1) సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రేషనల్లైజేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. 

2) విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. 

3) గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. 

4) తెలంగా చారిటబుల్, మరియు హిందూ సంస్థల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. 

5) పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లును సభలో చర్చకు పెట్టి ఆమోదం కోసం కోరనున్న సీఎం రేవంత్ రెడ్డి.

Post a Comment

أحدث أقدم