ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం లోని ఉప్పక ప్రాథమిక పాఠశాల లో ఉన్నటువంటి హ్యాన్డ్ బోర్వెల్ పంపు గత రెండు రోజులు గా పని చేయడం లేదు. ప్రాథమిక పాశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల పరిస్థితి తెలుసు కున్న ఏంపీఓ వేంకటేశ్వర రావు, ఆర్ డబ్ల్యూ ఏ ఈ ప్రవీణ్ వెంటనే స్పందించి ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పరిస్థితి చూసి మంగళ వారం నాడు ఉదయమే బోర్వెల్ పంపు మరమ్మతులు చేపించి పిల్లల దాహం తీర్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎండాకాలం కాబట్టి మండలం లోని అన్ని గ్రామాల లో గ్రామ ప్రజలకి, పాఠశాల లో విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం అని ఆయన అన్నారు. మండలం లోని గ్రామాల లో ఎక్కడయినా నీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆయన తెలియజేశారు.
إرسال تعليق