మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సౌజన్య



  ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్,  మణుగూరు: మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన కూరపాటి సౌజన్య రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పీసీసీ మహిళా విభాగం అధ్యక్షరాలు సునీతారావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న సమక్షంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలఫై మహిళా కాంగ్రెస్ పక్షాన చేపట్టిన కార్యక్రమాలను, విజయవంతం చేయటం లోను, మండలంలో మహిళా కాంగ్రెస్ బలోపేతం చేయడంలో సౌజన్య కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలను గుర్తించిన మహిళా కాంగ్రెస్ నాయకత్వం తిరిగి రెండోసారి ఆమెకు మండల బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సౌజన్య పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను ఆయన క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 

తనకు రెండోసారి మండల అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వడం హర్షనీయమన్నారు. మహిళా కాంగ్రెస్ బలోపేతంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో కీలకమైన మండల మహిళా కాంగ్రెస్‌ బాధ్యతలను రెండో మారు అప్పగించినందుకు మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న లకు ధన్యవాదాలు తెలిపారు. సౌజన్య రెండోసారి ఎన్నిక కావడం పట్ల మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


Post a Comment

أحدث أقدم