ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బిఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన పాలనను ముగించి నేటికి సంవత్సరం గడిచినా కూడా ఆ పార్టీ నాయకులు అదే భ్రమలో మాట్లాడుతున్నారని, పంచాయతీ ఎన్నికల్లో గెలుపు వారిదే అని పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం అన్నారు. రాబోయే కాలంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో అన్ని పంచాయతీలను మండల వ్యాప్తంగా గెలిపించి తీరుతామని బయ్యారం క్రాస్ రోడ్ నందు గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు. ఈ మేరకు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు పగటి కలలు కనడం మానేయాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి పది సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజాభీష్టం మేరకు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయ డంఖా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మర్చిపోవద్దని, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు వర్గాల భేదం లేకుండా ఒకే తాటిపై నడిచి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించి తీరుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఆరోగ్యాలంటీల అమలు లో భాగంగా ఉచిత మహిళల బస్సు ప్రయాణం, రైతన్న భరోసా, ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల కోసం గ్యాస్ సబ్సిడీ 500, రైతు రుణమాఫీ తదితర పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకంటూ ప్రత్యేక పాలనా ముద్రను వేసుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకై ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా అనితర సాధ్యమైన అన్ని అడ్డంకులను అధిగమించి పథకాల అమలు తీరును గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీల వారీగా కాంగ్రెస్ జెండాను ఎగురవేసి జడ్పిటిసి లను ఎంపీటీసీలు, ఎంపీపీ లను సర్పంచ్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించుక తీరుతామని స్థానిక బిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో తోలెం అర్జున్ ,నవ్వాతి శీను, మద్దెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
