బస్సు ఫుల్ ప్రయాణికుల ఇక్కట్లు

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:




తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాలు అని పథకం ప్రవేశ పెట్టాక మహిళలే అధిక సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రతి బస్సు ఖాళీ లేకుండా కిక్కిరిసిపోతుంది. పరిమితికి మించి జనాభా బస్సు ఎక్కుతున్నారు. 

అనారోగ్యంతో ఉన్నవారు బస్సు ఎక్కితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నించోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బస్సుల్లో అధిక రద్దీ ఉండడంవల్ల వికలాంగులు ప్రయాణాలు చేసే పరిస్థితి లేదని చెప్పాలి.


 సీట్లు దొరకక మెట్ల మీద కూడా నించొని ప్రయాణాలు చేస్తున్నారు. 
బస్సులో జనాల్ని చూస్తే వామ్మో అనాల్సిందే. కొన్ని సమయాలలో   జనాల వల్ల టైం కు రావాల్సిన బస్సు రావట్లేదు.

ఈ పథకం వల్ల లాభం ఎంతో కానీ నానా ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Post a Comment

أحدث أقدم