బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం


అశ్వాపురం ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పర్యటనలో భాగంగా అశ్వాపురం నుండి గొందిగూడెం వెళ్లే మార్గమధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న ఇసుక వాగు బ్రిడ్జిని ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు సందర్శించారు. తగు అధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం ఎన్ని రోజులలో పూర్తవుతుందో అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నాణ్యతలో ఏమాత్రం లోపం జరిగిన సహించేది లేదని వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

 ఈ కార్యక్రమానికి అశ్వాపురం ఎమ్మార్వో స్వర్ణలత , అశ్వాపురం మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత , అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య , కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు, యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم