భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు శూన్యం - సీఐ వెంకటేశ్వరరావు.
పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఈ. బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ ఆదేశాలతో రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకొని ఆటో డ్రైవర్లు, వాహన డ్రైవర్లతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్సూర్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు చిన్నపాటి అశ్రద్ధ వలన పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది, కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు.అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, వాహనదారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి