ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం మరోసారి సర్వే చేపట్టనుంది. ఇటీవల గ్రామసభల్లో వచ్చిన అభ్యంతరాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.
మూడు కేటగిరీలుగా దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు కేటగిరీలుగా విభజించారు. ఎల్–1లో సొంత స్థలం ఉండి ఇల్లు లేనివాళ్లు, ఎల్–2 లో స్థలం, ఇల్లు రెండూ లేని వాళ్లు, ఎల్–3లో అద్దె/రేకులు/పెంకుటిళ్లలో ఉన్నవారిని చేర్చారు. ప్రస్తుతం ఎల్–1 విభాగంలో ఉన్న దరఖాస్తుదారులకు ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్...
إرسال تعليق