నూతన సంవత్సర వేడుకలలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు; ఈ. బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు

 నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవు 

-సీఐ వెంకటేశ్వరరావు 

పినపాక , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

ఈ.బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఎవ్వరూ డీజే లు వినియోగించరాదని,రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేయడం రోడ్లపై కేకులు కట్ చేయడం లాంటివి చేయరాదని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. సోమవారం ఆయన ఈ బయ్యారం పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ..మద్యం తాగి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారిపై చట్టపరంగా చర్య తీసుకుని జైలుకు పంపబడటం తో పాటు వాహనాలు సీజ్ చేయబడునని హెచ్చరించారు.

ఈ.బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి ఈవెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కనుక ప్రజలందరూ వారి వారి ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవలెనన్నారు.నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా గస్తీ నిర్వహించే పోలీసులకు సహకరించి వారి సూచనలు పాటించగలరన్నారు.నూతన సంవత్సర వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదని ఎవరైనా పై నిబంధనలు ఉల్లంఘించిన చట్ట ప్రకారం చర్య తీసుకోబడునని, అదేవిధంగా శాంతి భద్రతల విషయమై ఎటువంటి సమాచారం ఉన్న డయల్ 100 కి ఫోన్ చేయగలరన్నారు.

Post a Comment

أحدث أقدم