సమస్యలు తెలుసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది
---హాస్టల్ విద్యార్థుల సమస్యలపై పోరాటం ఆగదు...
బి ఆర్ ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో విద్యార్థుల సమస్యలు తెలుసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని లోకేశ్వరం మండలం బి ఆర్ ఎస్ పార్టీ కన్వీనర్ కరిపే శ్యాంసుందర్ అన్నారు. బి.ఆర్.ఎస్.వి గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం లోకేశ్వరం మండల కేంద్రంలో గల బిసి సంక్షేమ వసతి గృహం లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆ పార్టీ నాయకులతో కలిసి సందర్శించేందుకు వెళుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ నిర్బంధాన్ని సహించేది లేదని విద్యార్థుల కోసం పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి ప్రశాంత్, దిగంబర్ సాయన్న, అనిల్ ,హరీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق