లఘుచర్ల రైతుల అక్రమ అరెస్టులు అమానుషం

 లగచర్ల రైతుల అక్రమ అరెస్టులు అమానుషం...

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

భారాస పార్టీ అధిష్టానం కెటిఅర్ ఆదేశాలతో,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు మంగళవారంరోజున ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతుల అక్రమ ఆరెస్ట్ లకు నిరసనగా భారత రాజ్యాంగ నిర్మాత డా: బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు..ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సింహాచలం జగన్ మాట్లాడుతూ. ..

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచి రైతులను మభ్య పెట్టి రైతులను మోసం చేస్తున్నారు ఇప్పుడు అదే రైతులను అక్రమంగా అరెస్టు చేస్తూ నియంతృత్వ పాలనతో భయబ్రాంంతులకు గురిచేస్తూ తరతరాలుగా సాగు చేస్తున్న దళిత గిరిజనుల భూములు స్వాధీనం చేసు కోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం లో రైతులను ఇబ్బందులకు గురి చేయడం లగచర్ల లో పేద రైతుల భూములను లాక్కొని రైతులను మోసం చేస్తుంది అని ఫార్మా కంపెనీ పేరుతో పెదప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలనే నీచమైన ఆలోచనలాతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతులను అరెస్టులు చేసి బేడీలు వేసి జైల్లో పెట్టడం రైతుల భూములు లాక్కొని ముఖ్యమంత్రి స్వలాభం కొరకు అభివృద్ధి పెరుచెప్పి వ్యాపారావెత్తలకు అప్పచెప్పడం సరికాదు అన్నారు.అభంశుభం తెలియని రైతులపై థర్డుడిగ్రీ ఉపయోగించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఇకనైన ఇలాంటి నీచమైన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం మానుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఆలోచించాలి అని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎండపల్లి భా రా స మండల అధ్యక్షులు సింహచలం జగన్, మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం,భా రా స నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

కొత్తది పాతది