కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి అసెంబ్లీ సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు, పరిసర గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదలపై ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టేవిదంగా చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు స్పీకరును కోరారు. మంగళవారం జరిగిన అసెబ్లీ సమావేశాల్లోకూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ, పరిసర గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుపై వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అడ్డుగా ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 1950 ప్రెసెడెంషియల్ ఆర్డరుపై గతపాలకులకు, అధికారులకు సరైన అవగాహన లేకపోవడం, ఆర్డర్ అర్ధంచేసుకోవడంలో లోపంవల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అదేవిధంగా పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారిందన్నారు. ఇలాంటి సాంకేతిక లోపాలను అధిగమించి కార్పొరేషన్ ఏర్పాటు, పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాల్సివుందన్నారు. పాల్వంచ కేటీపీఎస్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కోరుతున్నానన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు విషమై పలుమార్లు జిల్లా మంత్రుల సహాకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, కార్పొరేషన్ ఏర్పాటుతో పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు పరిసర గ్రామాలు మరింత అభివృద్ధి సాదించేందుకు దోహదపడుతుందన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి