రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఇంకా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో దట్టమైన పొగమంచు ఏర్పడొచ్చని, వచ్చే వారం రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదని తెలిపింది.
Anjanna
إرسال تعليق