తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు ; మంత్రి శ్రీధర్ బాబు

 *తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు: మంత్రి శ్రీధర్ బాబు* 

హైదరాబాద్: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 


రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ప్రారంభించారు. 

దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందు బాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లో నిర్వ హించిన ప్రజావిజయో త్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

టీఫైబర్ ద్వారా టీవీ, మొబైల్, కంప్యూటర్ వినియోగించ వచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. దీంతోపాటు మీసేవ మొబైల్‌ యాప్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. 

ఈ యాప్ లో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చామ న్నారు. రైతులకు రుణ మాఫీ, బోనస్‌ కోసం యాప్ ప్రారంభించినట్లు తెలి పారు.రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో టీ ఫైబర్ సేవలను ఇవాళ ప్రారంభించింది.

గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్లు తెలుస్తోంది. దశల వారీగా ఇంటర్నెట్ సేవలను రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. టీ ఫైబర్ ఇంటర్నెట్ వైఫై కనెక్షన్‌ మాదిరిగా పనిచేస్తుంది. 

ఈ కనెక్షన్‌ తీసుకుంటే టీవీ తో పాటు ఫోన్, ఓటీటీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పి స్తారు. టీఫైబర్ తొలిదశంలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 గ్రామ పంచాయతీల్లో అమలు చేయనున్నారు. అనంతరం ఇతర గ్రామా లకు విస్తరించనున్నారు..

Post a Comment

أحدث أقدم