పినపాక , ఎన్కౌంటర్ బులెట్ న్యూస్
పినపాక మండల పరిధిలోని సీతంపేట బెస్త గూడెం బజారు బురదమయంగా మారింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు రహదారి అధ్వానంగా తయారైంది.ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. చిన్నపాటి వర్షం వస్తే చాలు రోడ్డుపై నిలిచి బురద మయంగా మారుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ బురద నీటిలో ప్రమాదకరమైన దోమలు తయారై అనారోగ్యానికి గురి చేసే ప్రమాదం లేకపోలేదు. ఈ దారి గుండా పశువులు కూడా నడుస్తుంటాయి. స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాల్సి వస్తుంది. అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి