మంచిర్యాల జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
మంచిర్యాల జిల్లా, నెన్నెల మండలం, లంబడి తండాకు చెందిన దరావత్ తులసి (32) బెల్లంపల్లికి వెళ్తున్న లోడుతో ఉన్న ఇసుక ట్రాక్టర్ పై నుంచి జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్ళితే …
నెన్నెలలో బ్యాంక్ పని కోసం బయలుదేరిన తులసి ఖర్జీ నుండి బెల్లంపల్లి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను లిఫ్టు అడిగి ఇంజన్ కు ట్రాలీకి మధ్యలో ఉన్న రాడ్డుపై నిలబడింది. నెన్నెల మూలములుపు వద్ద అదుపు తప్పి జారి పడిన మహిళ, ట్రాలీ టైరు కింద పడి మరణించినట్టు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి...
ఆకాంక్ష మేళా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం నియోజకవర్గం:
దుమ్ముగూడెం మండలం, నరసాపురం గ్రామంలో రైతు వేదిక వద్ద ఆకాంక్ష మేళా సందర్భంగా సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు...
రైతులకు అవగాహన కోరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రైతులందరూ పాల్గొని విధి విధానాలు తెలుసుకొని పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రైతులు, గ్రామస్తులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు...
ఇట్లు
ప్రోగ్రామ్ ఇన్చార్జి MD నవాబ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి