బిగ్ బ్రేకింగ్ న్యూస్... దుమ్ముగూడెం సీఐ కి డీఎస్పీగా ప్రమోషన్


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


నీతి నిజాయితీ నిబద్ధతతో అంకితభావ విధులు నిర్వహించిన దుమ్ముగూడెం సిఐ బొడ్డు అశోక్ ని ప్రభుత్వం డీఎస్పీ గా ఉద్యోగోన్నది కల్పించడం నిజంగా హర్షనీయం.....


 హృదయపూర్వక అభినందనలు.. 💐 





Also Read...

చర్ల, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


బహుజనులారా (ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీ ప్రజలారా)

ఈ కాంగ్రెస్,బిజెపి, బిఆర్ఎస్, లకు ఓట్లు వేయడం అంటే మన వేలుతో మన కంటిని పొడుచుకున్నట్లే...


సంక్షేమ పథకాలను ఎరవేసి బహుజన జాతులను ఎల్లకాలం అధికారానికి దూరం చేయాలేరు


 రాజ్యాధికారంలో బహుజనులకు (sc st bc మత మైనారిటీ ప్రజలకు) సమాన వాటాను అగ్రవర్ణ అధిపత్యా కులాల పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ లు ఇవ్వవు


సర్వ సమానత్వం కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మగౌరవ ఉద్యమాన్నీ బహుజనలు ఐక్యంగా బలపరచాలి


బీఎస్పీకి అధికారం ఇవ్వడం ద్వారానే బహుజన జాతుల్లో అభివృద్ధి జరుగుతుంది 


కొండా చరణ్ బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు 

........................................


చర్ల మండల కేంద్రంలో ఉన్న బి ఎస్ పి మండల కార్యాలయంలో మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు కొండా చరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆవుల అన్నపూర్ణ అను ఆమెని కొండా చరణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అన్నపూర్ణ గారి చేరిక బహుజన ఉద్యమానికి బలం చేకూరుస్తుందని ఆమెకు పార్టీ అండగా ఉంటుందని కొండా చరణ్ అన్నారు ఏళ్ల తరబడి అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం కలిగిన కులాల పార్టీలకు అధికారం ఇవ్వడం ద్వారా బహుజనులకు న్యాయం జరగడంలేదని భారత రాజ్యాంగ ఫలాలు బహుజన జాతులకు అందడం లేదని అన్నారు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ లు బహుజన జాతులకు అధికారం దక్కకుండా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు సంక్షేమ పథకాలను ఎరవేసి బహుజన జాతులను ఎల్లకాలం అధికారానికి దూరం చేయాలేరు తెలిపారు రాజ్యాధికారంలో బహుజనులకు (sc st bc మత మైనారిటీ ప్రజలకు) సమాన వాటాను అగ్రవర్ణ అధిపత్యా కులాల పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ లు ఎన్నటికీ ఇవ్వవు అని అన్నారు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీ ప్రజలు ఆ పార్టీలను తక్షణమే వేడాలని అనాదిగా బహుజన జాతులకు నష్టం చేస్తున్న ఈ పార్టీలకు అధికారం ఇవ్వడం అనేది మన వేలుతో మన కంటిని పొడుసుకున్నట్లే అని అన్నారు 

రాజ్యాధికారంలో మరియు సర్వ సమానత్వం కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మగౌరవ ఉద్యమం జరుగుతుందని ఆ ఉద్యమాన్నీ బహుజనలు ఐక్యంగా బలపరచాలనీ కోరారు బీఎస్పీకి అధికారం ఇవ్వడం ద్వారానే బహుజన జాతుల్లో అభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తు బిడ్డల రక్షణ కోసం ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీ ప్రజలు ఐక్యతతో బహుజన బలాన్ని నిరూపించాలని పిలుపునిచ్చారు  

ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ పార్టీ మండల కార్యదర్శి సామల ప్రవీణ్ పార్టీ మండల కోశాధికారి చెన్నం మోహన్ పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ పార్టీ ఉప్పరగూడెం సెక్టార్ ప్రధాన కార్యదర్శి ఎస్కె జహీరుద్దీన్ భాష పార్టీ మండల నాయకుడు ఎం సందీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.



Also Read...



నూతన సిడిపిఓ లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క



Tgpsc ద్వారా cdpo లుగా ఎంపికైన 23 మంది 


సచివాలయంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న 23 మంది సిడిపిఓ లు సిడిపివోలుగా నియామక పత్రాలు అందుకున్న అందరికీ అభినందనలు


సిడిపిఓలు మహిళా శిశు సంక్షేమ శాఖ వెన్నెముక లాంటివారు 


మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ


వేల మంది పోటీ పడితే మీ 23 మంది ఉద్యోగాలు సాధించారు


మీరంతా ఎంతో అంకితభావంతో ఉద్యోగాలు సాధించారు 


ఇదే అంకితభావంతో మీరంతా విధులు నిర్వహించాలి


ఉన్నత విద్యావంతులైన మీరు మా శాఖలో చేరటం అభినందనీయం


ఆరు సంవత్సరాల వరకు చిన్నారులు, గర్భిణీలు బాలింతలకు సేవ చేసే అదృష్టం మీకు దక్కింది 


శిశువులు మహిళల సంరక్షణతో పాటు దత్తత ప్రక్రియ, మహిళా సాధికారత వంటి అంశాలను నిర్వర్తించాల్సి ఉంటుంది 


అంగన్వాడి సేవలు పేద ప్రజలకు ఎంతో అవసరం 


అంగన్వాడీ లబ్ధిదారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే బాధ్యత మీదే 


మా శాఖలో ఇది కొత్త తరం


అంగన్వాడీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సేవలను లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత మీదే 


ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు అంగన్వాడీలను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నాం 


అంగన్వాడిలో 57 రకాల ఆట వస్తువులు ఇచ్చాము 


వారంలో రెండు రోజులు ఎగ్ బిర్యాని పెడుతున్నాము 


పోషకార లోపాన్ని తగ్గించేందుకు పాలు గుడ్లు క్రమం తప్పకుండా సరఫరా చూస్తున్నాము


చిన్నారులకు యూనిఫామ్స్ కూడా ఇస్తున్నాము


మీరంతా అంకితభావంతో పనిచేయాలి 


కార్యాలయాలకే పరిమితం కాకుండా ఫీల్డ్ విజిట్ చేయాలి 


అంగన్వాడి సేవలు మెరుగుదలకు మీరు సలహాలు సూచనలు ఇవ్వవచ్చు 


ఎలాంటి రాజకీయ ఒప్పులకు లొంగాల్సిన అవసరం లేదు.. స్వేచ్ఛగా పనిచేయండి

Post a Comment

కొత్తది పాతది