మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్:
మణుగూరులో పినపాక నియోజకవర్గం ఆటో మ్యాజిక్ ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల 500 రూపాయలు సంపాదించడం కూడా కష్టంగా మారిందని తెలిపారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఆటో ఇఎంఐలు, ఇల్లు గడవడం కష్టంగా మారిందన్నారు. ఉచిత బస్సు వల్ల అప్పుల పాలై నానా అవస్థ పడుతున్నామని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఉచిత బస్సుని నిలిపివేయాలని, ఆటో యూనియన్ ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ భారీ ఎత్తున డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి