అశ్వాపురం ఫారెస్ట్‌లో కలకలం! ఫారెస్ట్ రేంజర్ రమేష్ సస్పెండ్!

 



అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఫారెస్ట్ డివిజన్‌లో భారీ సంచలనం రేగింది. ఫారెస్ట్‌ ల్యాండ్‌ను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ రేంజర్ రమేష్‌ను పీసీసీఎఫ్ (Principal Chief Conservator of Forests) తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.


అధికార వర్గాలు విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.


స్థానిక వన్యప్రాంతాల్లో భూ విక్రయాలు, అంతర్గత లాభాల కోసం అధికారుల పాత్రపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి నిజాలు విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


 ఇంకా వివరాలు వెలుగులోకి రానున్నాయి…

Post a Comment

కొత్తది పాతది