మణుగూరు:భార్యను హత్య చేసిన కేసులో ముద్దాయికి జీవిత కాలం శిక్ష




మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


        మణుగూరుకు చెందిన బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి 11.08.2020 సంవత్సరంలో కుటుంబ గొడవల కారణంగా తన భార్య అయిన బత్తుల వెంకట లక్ష్మి @ సుధా అనే ఆమెను హత్య చేయగా మణుగూరు పోలీస్ స్టేషన్ నందు Cr.No.307/2020 U/s 498(A),302 IPC గా నమోదు అయ్యింది. ఇట్టి కేసులో ఈరోజు కొత్తగూడెం Principal district session కోర్టు వారు ముద్దాయికి జీవిత కాలం శిక్ష , 2000 రూపాయల ఫైన్ విధించడం జరిగింది.ఇట్టి కేసులో అప్పటి దర్యాప్తు అధికారులు అయినా MA సుకూర్, R.భాను ప్రకాష్, ప్రస్తుత దర్యాప్తు అధికారి P. నాగబాబు , SDPO మణుగూరు గారిని ,అదే విధంగా కోర్ట్ కానిస్టేబుల్ అశోక్ ని జిల్లా ఎస్పీ  అభినందించడం జరిగింది.



ఇది కూడా చదవండి...

ఉప్పొంగుతున్న బొగత జలపాతం


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జల్లేరు, మల్లన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


 ములుగులోని బొగత జలపాతం ఉప్పొంగుతోంది. వరద ప్రవాహానికి జలపాతం వద్ద గ్రిల్స్, గోడలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 26 వరకు అధికారులు సందర్శన నిలిపివేశారు.



ఇది కూడా చదవండి...


 


ఒక వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వరుణడు.. ఇప్పుడు తెలంగాణ మీద తన ప్రతాపం చూపుతున్నాడు. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. 


జలాశయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదిలా ఉంటే గ్యాప్ లేకుంగా కురుస్తున్న వర్షాల వల్ల జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. వారం రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆ వివరాలు..


తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అనగా శుక్ర, శనివారం, ఆదివారం, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరి కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


 ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Post a Comment

కొత్తది పాతది