EB NEWS /పినపాక:
మండలంలోని సింగిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 353లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రైస్ మిల్, బ్రిక్స్ కంపెనీ, గుడి నిర్మాణాలు చేపట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం డిమాండ్ చేసింది.
సర్వే నంబర్ 353లోని భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి, అది ప్రభుత్వ భూమిగా నిర్ధారణ అయితే ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సంఘం కోరింది.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని అర్హులైన పేద గిరిజన, ఆదివాసీలకు ఇంటి స్థలాల కోసం కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పినపాక మండల తహసీల్దార్ తక్షణమే చర్యలు చేపట్టాలని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం పినపాక మండల అధ్యక్షుడు కొమరం శ్రీను కోరారు.

