EB NEWS/ పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గోడిశాల రామనాథంను నియమించారు. పార్టీ బలోపేతం, కార్యక్రమాల విస్తరణలో ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రామనాథం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్నారు.

