BSNL లో అదిరిపోయే ఫీచర్... ఇక నంబర్ చెప్పకుండా రీఛార్జ్!



EB NEWS/భారత్:


మహిళల ఫోన్ నంబర్లను రక్షించేందుకు BSNL సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. *“కవచ్”* పేరుతో ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా ఇకపై మహిళలు ఆఫ్‌లైన్ రీఛార్జ్ షాపుల్లో తమ మొబైల్ నంబర్‌ను చెప్పకుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశం కలిగింది. 


ఈ ఫీచర్ వల్ల మహిళల మొబైల్ నంబర్ ప్రైవేట్‌గా ఉంటుంది. దీంతో అనవసరమైన ఫోన్ కాల్స్, వేధింపులు లేదా నంబర్ దుర్వినియోగం జరిగే అవకాశాలు తగ్గుతాయని BSNL అధికారులు తెలిపారు. 


మహిళల గోప్యతను కాపాడే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కొత్త సదుపాయం త్వరలో దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలు కానుందని సంస్థ పేర్కొంది.


మహిళల భద్రత కోసం టెక్నాలజీతో ముందుకు వచ్చిన BSNL చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Post a Comment

أحدث أقدم