రైతులకు గుడ్ న్యూస్... రైతు భరోసా నిధులు పడేవి ఎప్పుడంటే..!

 


EB NEWS/తెలంగాణ:


రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం కింద రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించనుంది.


అయితే కొన్ని వర్గాలకు ఈ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. బీడు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు రైతు భరోసా పథకానికి అనర్హులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రజాప్రతినిధులు కూడా ఈ పథకం పరిధిలోకి రారు.


కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలు  నింపిన దరఖాస్తు ఫారాన్ని మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా క్లస్టర్ అధికారికి ఆఫ్‌లైన్‌లో సమర్పించాలని అధికారులు సూచించారు.


రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. 


Post a Comment

కొత్తది పాతది