భద్రాద్రి: విల్లు ఎక్కు పెట్టాడు.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు

 


EB NEWS /అశ్వాపురం:


అశ్వాపురం మండలంలోని మారుమూల గ్రామం మామిళ్లవాయి నుంచి మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుతూ బొర్రా కౌశిక్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో మొదటి బహుమతి సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.


పిట్ట కొంచెం కూత గనం అన్నట్లుగా చిన్న వయసులోనే విలువిద్యలో అద్భుత ప్రతిభ కనబరిచిన కౌశిక్, రాష్ట్ర స్థాయి పోటీల్లో తన కచ్చితమైన లక్ష్యసాధనతో జడ్జీలను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మారుమూల గ్రామం నుంచి వచ్చినప్పటికీ పట్టుదలతో సాధన చేసి ఈ విజయాన్ని అందుకోవడం స్థానికులకు గర్వకారణంగా మారింది.


కౌశిక్ సాధించిన ఈ విజయంపై గ్రామస్తులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.


అశ్వాపురం మండలానికి చెందిన ఈ చిన్నారి ప్రతిభ రాష్ట్ర స్థాయిలో మెరవడం మామిళ్లవాయి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. 


Post a Comment

కొత్తది పాతది