EB NEWS/కొత్తగూడెం:
కొత్తగూడెం సమీపంలో కారు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నా, అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. బద్దుతండా సర్పంచ్ బానోత్ నరేష్ తన స్నేహితులతో కలిసి బుజ్జాయిగూడెంలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోళ్లపాడు సమీపంలో కారు రివర్స్ చేస్తుండగా ఇంజిన్ భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఇల్లందు అగ్నిమాపక సిబ్బంది వేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు . అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. టీజీ 28 1090 నంబర్ గల సిఎన్జి కారులో సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు వారు ముందుగానే బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి