EB NEWS/ఇల్లందు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
సమాచారం ప్రకారం.. ఆ మహిళ సుమారు ఆరు నెలల క్రితం ఇంటిని వదిలి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏలూరులో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం రాత్రి ఇల్లందు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బుధవారం ఉదయం పోలీసుల విచారణ కొనసాగుతుండగా, మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న శానిటైజర్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుండగా, పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనతో ఇల్లందు ఠాణాలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి