అడవుల రక్షణా? రైతుల జీవనాధారమా? పినపాకలో టెన్షన్!

 


పినపాకలో పోడు భూములపై ఉద్రిక్తత… జేసీబీలు రంగంలోకి, రైతుల ఆందోళన పెరుగుతోంది 


EB NEWS/ పినపాక:


పినపాక మండలం బందగిరి నగర్‌లో పోడు భూముల వివాదం మరింత ముదురుతోంది. అటవీ భూములను రక్షించాలనే ఉద్దేశంతో అధికారులు చర్యలు ప్రారంభించగా, మరోవైపు సంవత్సరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నామని రైతులు తమ హక్కును కాపాడుకునేందుకు నిలబడుతున్నారు.


ఈ రోజు అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వడం ప్రారంభించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ జీవనాధారం అయిన భూములను తీసుకోకూడదని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం అటవీ భూముల పరిరక్షణ కోసం ఈ చర్యలు అవసరమని చెబుతున్నారు.


దీంతో ఒకవైపు అడవులను కాపాడాలనే అధికారుల ప్రయత్నం, మరోవైపు జీవనాధారం కోసం పోరాడుతున్న రైతుల ఆందోళన మధ్య బందగిరి నగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో పరిస్థితిని గమనిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.





Post a Comment

కొత్తది పాతది