EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం:
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘గద్దర్’ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువ దర్శకుడు సాయిలు కాంపాటి ప్రతిభ చాటుకున్నారు. ఇల్లందు మండలం కొమరానికి చెందిన సాయిలు కాంపాటి తెరకెక్కించిన *‘రాజు వెడ్స్ రాంబాయి’* చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, ఆయన ఉత్తమ దర్శకుడిగా అవార్డును దక్కించుకున్నారు.
అదే చిత్రంలో నటించిన చైతు జొన్నలగడ్డ ఉత్తమ నటుడిగా, అనురాగ్ ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. ఒకే చిత్రానికి పలు విభాగాల్లో అవార్డులు రావడం విశేషంగా నిలిచింది.
రాష్ట్రస్థాయి గద్దర్ అవార్డుల్లో భద్రాద్రి జిల్లాకు చెందిన యువ దర్శకుడు మెరిసిపోవడంతో జిల్లా వాసులు, సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, స్నేహితులు సాయిలు కాంపాటికి అభినందనలు తెలుపుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి