కొత్తగూడెం పోలీసుల భారీ ఆపరేషన్… ఏడాదిలోనే 6500 కేజీల గంజాయి సీజ్!


EB NEWS /భద్రాద్రి కొత్తగూడెం:


దేశంలోనే గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీస్ విభాగాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందంజలో నిలుస్తోంది. గత ఏడాది కాలంలోనే కొత్తగూడెం పోలీసులు సుమారు 6500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.


లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వ్యాపారంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టుబడిన నేరస్థులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.


యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించిన ఎస్పీ, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.


Post a Comment

కొత్తది పాతది