పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా మహా పూర్ణాహుతి |భారీగా తరలివచ్చిన భక్తులు



EB NEWS/పాల్వచ:

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాల్వంచ మండలంలోని కెపి జగన్నాధపురంలో గల పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగాణంలో గల అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగం అనంతరం పూర్ణాహుతిని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణులచే శ్రీ చక్రార్చన, పుష్పయాగం, శయనోత్సవం, చూర్ణోత్సవము నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో రజనీ కుమారి , ధర్మకర్తల మండలి అధ్యక్షులు బాలినేని నాగేశ్వర రావు,సభ్యులు పెండ్లి రామిరెడ్డి,చెవుగాని పాపారావు, ఆలయ సిబ్బంది,అర్చకులు,పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది