కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా మణుగూరులో కార్మికుల ర్యాలీ

 


మణుగూరు, EB న్యూస్:

కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్మికులు ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి వినతిపత్రం సమర్పించారు.

నాలుగు లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం, విత్తనాల బిల్లు వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 రోజుల పని, రోజుకు రూ.300 వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

Post a Comment

కొత్తది పాతది