EB NEWS: కొత్తగూడెం:
కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
సింగరేణిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న బొగ్గు కుంభకోణంపై అడ్డుకట్ట వేయాలంటే కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంపై కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావుతో మాట్లాడినట్లు చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీని రాజకీయంగా ఎండగట్టడానికే సీపీఐకి ఈ ఆఫర్ ఇచ్చామని స్పష్టం చేశారు.
ఈ రోజు జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను సీపీఐ 22, కాంగ్రెస్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీఆర్‌ఎస్ 8, సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 6 స్థానాలు దక్కించుకున్నాయి. సమసమం నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
తాజా ప్రకటనతో మున్సిపల్ పాలకవర్గ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి